Sunday, November 1, 2009

ఎరువులు -వాడకం

రైతులు వాడే ఎరువులు పూర్తిగా పంటకు అందాలంటే కొన్ని విషయాలు తెలిసివుంటే మంచిది.
1.మనం వాడే ఎరువు రకం ,అంటే నత్రజని ,పోటాష్,ఫాస్ఫరస్ రకాలు
2. నేల రకం ,(తేలిక నేలలు ఉదా :ఇసుక నేలలు & బరువైన నేలలు ఉదా: ఒండ్రుమట్టి నేలలు )
3. పంట యొక్క దశ (లేత మొక్కలు ,పెరిగే వయసులో వున్న మొక్కలు ,ఫలసాయం ఇచ్చే దశ లో ఉన్న
మొక్కలు )
పంట ఏ దశలో నైన అవసరం అయ్యేది నత్రజని (N)
పంట లేత దశ లో వేర్ల పెరుగుదలకు అవసరం అయ్యేది ఫాస్ఫరస్ (P)
పంట మొదటి దశ అంటే మొదటి మూడవ వంతు కాలంలో అవసరం అయ్యేది పోటాష్ (K)
(ఉదా: పంటకాలం నూట ఇరవై రోజులు ఐతే మొదటి నలభై రోజులు )అవసరం ఉంటుంది .
నత్రజని ఒకేసారికన్నా , చాలినంత గా వివిధ దశల్లో ఇవ్వడం మంచిది
ఫాస్ఫరస్ మొత్తం దుక్కిలో లేదా మొక్కలు నాటే సమయంలో ,వేర్లకు దగ్గరగా వేయడం సరిపోతుంది.
పోటాష్ బంకనేలలు / బరువైన నేలల్లో మొత్తం దుక్కిలో లేదా మొక్కలు నాటే సమయంలో వేస్తే సరిపోతుంది.
అదే ఇసుక నేలల్లో పంట మొదటి మూడవ వంతు కాలంలో ఒకటికన్నా ఎక్కువసార్లు ఇస్తే మంచిది.